Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పానీపూరి' పేరుతో విడుదలై ఘన విజయం సాధించిన కన్నడ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తన భీమవరం టాకీస్ పతాకంపై తెలుగులో 'స్మగ్లర్' పేరుతో విడుదల చేస్తున్నారు. వైభవ్, జగదీష్, సంజరు, అను, అక్షత, దర్శిత, యోగేష్ ప్రధాన పాత్రలు పోషించారు. నవీన్ కుమార్ కె.ఫి దర్శకత్వం వహించారు. విడుదలకు సిద్ధం చేస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ, 'నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉండే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమిది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సెన్సార్ పనులు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని చెప్పారు.