Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ యోగా గురు, మార్షల్ ఆర్ట్స్ సురేష్ కమల్ హీరోగా, వైశాలి, కిమయా కథానాయికలుగా నటిస్తున్న చిత్రం 'దివ్యమణి'. గిరిధర్ గోపాల్ దర్శకత్వంలో మోV్‌ా మాయా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రమిది. జులై 6న విడుదల కానున్న సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'ప్యార్లల్ కిక్, నాన్ చాక్‌తో టేబుల్ టెన్నిస్ ఆడటం, రన్నింగ్, లారీ కింద నుంచి స్లయిడ్ అవ్వడం వంటి అద్భుతమైన స్టంట్స్‌ను రోప్ లేకుండా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో చిత్రీకరించాం. జైకాకేషా ఫైట్ మాస్టర్ వినూత్నమైన ఫైటింగులను కంపోజ్ చేశారు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. ఆదరించాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు.