Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నానితో కలిసి నటించే సినిమాలో నేను గ్యాంగ్‌స్టర్‌గా, నాని వైద్యుడిగా కనిపించనున్నారు. చాలా సరదాగా సాగిపోయే స్క్రిప్ట్ ఇది' అని నాగార్జున అన్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రమిది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం గురించి నాగార్జున ఓ మీడియా సంస్థలో మాట్లాడుతూ, 'ఈ సినిమా రాజ్ కుమార్ హిరాణీ శైలిలో సాగుతుంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వ ప్రత్యేకత ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఇతర నటుల వల్ల నా కెరీర్ సందిగ్దంలో పడుతుందని నేనెప్పుడూ భయపడలేదు. మొదట్లో నేను సోలో హీరోగా చాలా సినిమాలు చేశా. ఇటీవల వస్తున్న మల్టీస్టారర్ కథలతో చిత్రాలు చేయడం సంతోషంగా ఉంది. దర్శకుడు ప్రియదర్శన్‌ను ఇటీవల కలిశాను. కానీ స్క్రిప్ట్ వినలేదు. జూన్ చివరిలో పూర్తి స్క్రిప్ట్ వింటా. ప్రస్తుతం నానితో చేస్తున్న సినిమాతోనే బిజీగా ఉన్నా. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల ఒత్తిడికి గురి కావడం లేదు. నేను నటించే ప్రతి పాత్రను సవాల్‌గానే తీసుకుని చేస్తా' అని అన్నారు.