Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏ మాయ చేసావె', 'మనం', 'ఆటోనగర్ సూర్య' చిత్రాలతో నాగచైతన్య, సమంతల జోడీ మెప్పించింది. గతేడాది ప్రేమవివాహం చేసుకున్న ఈ ఇద్దరు ప్రస్తుతం వరుసగా రెండు సినిమాల్లో నటించబోతున్నారు. సమంత వచ్చే ఏడాది నుంచి సినిమాలకు దూరంగా ఉండనుందనే వార్తలు ఇటీవల వినిపించిన విషయం విదితమే. అందులో వాస్తవం లేదని మరో సందర్భంలో ఆమె వెల్లడించారు. అందులో భాగంగానే నెక్ట్స్ సినిమాలకు గ్రీన్ సిగల్ ఇస్తున్నారామె. 'నిన్నుకోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కలిసి ఓ చిత్రంలో నటించనున్నారు. అంతేకాదు హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలోనూ ఓ సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారట. ఈ ఇద్దరి జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో రాహుల్ రవీంద్రన్ ఓ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఇదే సెట్ అయితే చైతూ, సమంత జంటగా వస్తున్న ఐదో చిత్రమిదవుతుంది. ప్రస్తుతం సమంత 'యూటర్న్', 'సూపర్ డీలక్స్', 'సీమరాజా' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.