Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'విజేత' సక్సెస్‌మీట్‌లో అల్లు అర్జున్
కళ్యాణ్‌దేవ్, మాళవిక నాయర్ జంటగా వారాహి చలన చిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో రూపొందిన చిత్రం 'విజేత'. రాకేశ్‌శశి దర్శకత్వంలో నిర్మాత రజని కొర్రపాటి ఈచిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈచిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తున్న నేపథ్యంలో చిత్రయూనిట్ సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, 'ఒక పక్క పెద్ద సినిమాలు తీస్తూనే, మరో పక్క చిన్న సినిమాలు చేస్తున్న సాయికొర్రపాటికి కంగ్రాట్స్. ప్రతిసారి కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. మంచి కంటెంట్‌తో సినిమాలు తీస్తున్నారు. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. మంచి కంటెంట్‌తో వస్తే ఎప్పటికైనా వారాహిలో ఓ సినిమా చేస్తాను. 'విజేత' చిత్రానికి హర్షవర్థన్ మ్యూజిక్, సెంథిల్ ఫొటోగ్రఫీ, రాకేష్ టేకింగ్, సాయిగారి మేకింగ్ వ్యాల్యూస్, రామకృష్ణ సెట్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఈ సినిమాలో కళ్యాణ్‌ని చూడలేదు. కేవలం క్యారెక్టర్ని మాత్రమే చూశా. ఎమోషనల్ సీన్స్‌లో కంట తడిపెట్టించాడు. ఈ సినిమా నాకెంతో బాగా నచ్చింది కాబట్టే ఈ చిత్ర విజయోత్సవానికి వచ్చాను' అని చెప్పారు. 'సినిమా చాలా బాగుంది. తండ్రీకొడుకుల కథతో జెన్యూన్‌గా మంచి సినిమా చేశావని అందరూ అభినందిస్తున్నారు. నేను ఏదైతే కథ రాసుకున్నానో దానికి మురళీశర్మగారు 10 రెట్లు ఎక్కువ చేశారు. కళ్యాణ్ ప్రతీదీ నేర్చుకుని చాలా నేచురల్‌గా నటించాడు. ఈ సినిమాకి చిరంజీవిగారు చేసిన సపోర్ట్ మరువలేనిది' అని దర్శకుడు అన్నారు. 'ప్రేక్షకుల రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, విజయవాడకి వెళ్ళాం. అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఈ అనుభూతి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. బన్నీ ఈ సినిమా చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. అలాగే ఈ వేడుకకి కూడా వచ్చారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని కళ్యాణ్‌దేవ్ చెప్పారు.