Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలపై జరుగుతున్న అత్యాచార దాడుల నేపథ్యంలో ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందిన చిత్రం 'టెంపర్'. ఇక్కడ ఘన విజయం సాధించిన ఈ సినిమాను బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ తనయ సారా ఆలీఖాన్ కథానాయికగా పరిచయమవుతుంది. ధర్మ ప్రొడక్షన్స్, రోహిత్‌శెట్టి పిక్చర్స్ పతాకాలపై 'సింబా' పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఓ వీడియోను హీరో రణ్వీర్ సింగ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'నువ్వు మహిళలపై జరుగుతున్న దారుణాలను వ్యతిరేకంగా పోరాడకపోతే, రేపటి బాధితురాలు నీ కుటుంబ సభ్యురాలు అవుతుంది. మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రమాణం చేయండి. మహిళల్ని వేధించే వారికి శిక్ష తప్పనిసరి' అని ఈ వీడియోలో పేర్కొన్నారు. ఇందులో సంగ్రాం భాలేరావ్ అనే శక్తివంతమైన పోలీస్ అధికారిగా రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. వీడియోలో రౌడీల్ని చితకబాదే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 28న విడుదల చేయనున్నారు. తెలుగులో ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన 'టెంపర్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 2015లో విడుదలై వరుస పరాజయాల్లో ఉన్న ఎన్టీఆర్‌కు కాస్త రిలీఫ్‌నిచ్చింది. 'పద్మవత్'లో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో తనదైన నటనతో మెప్పించిన రణ్వీర్ సింగ్ ఈ చిత్రంతో తన నటనా ప్రతిభను చాటుకుంటున్నారు. రణ్వీర్ సింగ్ ప్రస్తుతం 'గల్లీబార్సు' చిత్రంతోపాటు కరణ్ జోహార్ నయా చిత్రంలో నటించబోతున్నారు.