Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూరజ్, అఖిల్ కార్తీక్, సోనియా, ఫర్ హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ జె.ఎల్.బి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం '2 ఫ్రెండ్స్'. ముళ్ళగూరు లక్ష్మి దేవి సమర్పణలో అనంత లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ముళ్ళగూరు అనంత రాముడు, ముళ్ళగూరు రమేష్ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేయగా,
చిత్ర ఫస్ట్‌లుక్‌ను అతిథులుగా విచ్చేసిన టి.రామసత్యనారాయణ, మల్కాపురం శివకుమార్, ఎంఎస్‌రెడ్డి, శోభారాణి తదితరులు రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ, 'ట్రైలర్ బాగుంది. విజువల్‌గా అందంగా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలి' అని అన్నారు. 'కళ్యాణ్ అన్న కోరిక మేరకు ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చాం. చాలా నవ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది' అని టి.రామసత్యనారాయణ తెలిపారు. దర్శకుడు శ్రీనివాస్ చెబుతూ, 'సినిమా చాలా బాగా వచ్చింది. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహాన్ని ప్రేమగా అనుకునే ఈ రోజుల్లో వారిద్దరి మధ్య స్నేహానికి సంబంధించిన విలువలను తెలిపే చిత్రమిది. చాలా కష్టపడి తెరకెక్కించాం. సురేందర్‌రెడ్డి ఫొటోగ్రఫీ, ఘటికాచలం సంగీతం
సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది' అని చెప్పారు. 'చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు సినిమాలు తీసి సక్సెస్ అయ్యాం. హైదరాబాద్ వచ్చాక వ్యాపారాలపై దృష్టి సారించి ఇక్కడా విజయం సాధించాం. మళ్ళీ సినిమాలు తీయాలని కొత్త కథాంశాలతో కూడిన సినిమాలు తీయాలని ఈ కథతో మీ ముందుకు వస్తున్నాం.
సినిమా అద్భుతంగా ఉంటుంది. వచ్చే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని నిర్మాత
ముళ్ళగూరు అనంతరాములు తెలిపారు.