Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పద్మావత్' వంటి సంచలన విజయం తర్వాత దీపికా పదుకొనె నటించే సినిమాకు సంబంధించి
ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రియుడు, నటుడు రణ్వీర్ సింగ్‌ను పెళ్ళి చేసుకోబోతుందని, సంజరు లీలా భన్సాలీ దర్శకత్వంలోనే మరో సినిమా చేయబోతుందంటూ పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే తాజాగా మరో ఆసక్తికర వార్త సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యింది. దర్శకురాలు మేఘనా గుల్జర్ దర్శకత్వంలో నటించేందుకు దీపికా సుముఖంగా ఉన్నారట. ఈ ఇద్దరూ గత కొన్ని రోజులుగా స్క్రిప్ట్‌పై చర్చిస్తున్నట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల 'చాల్బాజ్' చిత్ర రీమేక్‌లో నటించే ఆఫర్ దీపిక దగ్గరకు వచ్చిందట. అయితే ఆ ప్రాజెక్ట్‌కు మేఘనా గుల్జర్ దర్శకత్వం వహిస్తారా? లేక మరో కొత్త కథతో సినిమాని తెరకెక్కిస్తే అది మహిళా ప్రధాన చిత్రామా లేక కమర్షియల్ చిత్రమా? అనేది ఇప్పటికి సస్పెన్స్‌గానే ఉంది. ప్రస్తుతం 'జీరో' చిత్రంలో నటించిన అతిథి పాత్రతో దీపికా సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయబోతోంది.