Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అనారోగ్యం నా లక్ష్యాన్ని అడ్డుకోలేకపోయింది. అది నన్ను నియంత్రించక ముందే దాన్నే నేను కంట్రోల్ చేశాను' అని అంటున్నారు ప్రియాంక చోప్రా. సినిమా ప్రముఖులకు అనారోగ్య సమస్యలు కొత్తకాదు. క్యాన్సర్, ఆస్తమా వంటి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. గ్లోబల్ స్టార్‌గా, తిరుగులేని కథానాయికగా పేరొందిన ప్రియాంక ఓ షాకింగ్ న్యూస్‌తో అభిమానులను ఆందోళనకు గురిచేస్తూనే ఆశ్చర్యంలో ముంచెత్తారు. 'ఐదేండ్ల వయసు నుంచి ఆస్తమాతో బాధపడ్డాను. నాకు బాగా తెలిసిన వారికి మాత్రమే ఈ విషయం తెలుసు. ఆస్తమా నన్ను కంట్రోల్ చేయక ముందే నేను దాన్ని కంట్రోల్ చేసి బయటపడ్డాను. నా లక్ష్యాలను చేరే విషయంలో, నా జీవితంలో ముందడుగు వేసే విషయంలో అది నన్ను అడ్డుకోలేకపోయింది' అని ట్విట్టర్ ద్వారా ప్రియాంక తెలిపారు. ప్రస్తుతం హిందీలో 'ది స్కై ఈజ్ పింక్', హాలీవుడ్లో 'కౌబారు నింజా వికింగ్' చిత్రాల్లో నటిస్తోంది.