Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రధారులుగా 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రానికి విజరు కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. మంగళవారం చిత్ర టైటిల్ లోగోను, అమితాబ్ బచ్చన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కమాండర్ ఖుదాబక్ష్గా ఫస్ట్‌లుక్‌లో అమితాబ్ తలపాగ, తెల్లటి మీసం, చేతిలో కత్తితో యుద్ధానికి సిద్ధమవుతున్న వీరుడిలా కనిపిస్తూ ఫస్ట్‌లుక్‌లో అమితాబ్ గెటప్ అదిరిపోయేలా ఉండటం విశేషం. అత్యంత గ్రాండియర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.