Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రధారులుగా 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. ఈ సినిమాలోని అమితాబ్ లుక్‌ను మంగళ వారం చిత్ర బృందం విడుదల చేసింది. కమాండర్ ఖుదబక్ష్ పాత్రలో యుద్ధ వీరుడిగా అమితాబ్ ఆకట్టు కుంటున్నారు. తాజాగా బుధవారం సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న ఫాతిమా సనా షేక్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె జఫీరా పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు. యుద్ధ వీరనారిగా లక్ష్యం దిశగా విల్లు ఎక్కు పెట్టి ఉన్న ఫాతిమా గెటప్ ఆద్యంతం ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. విజరు కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తుంది. యశ్ రాజ్ ఫిల్స్మ్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. సినిమా ఎక్కువగా భాగం సముద్రం, పడవల నేపథ్యంలో సాగుతుందట. అందుకోసం యూరప్‌లోని మాల్టా సముద్రతీరంలో భారీ పడవలను రూపొందించారు. ఈ సినిమాను నవంబర్ 8న విడుదల చేయనున్నారు. అమిర్ ఖాన్ నటించిన 'దంగల్' చిత్రంలో ఆయనకు కూతురిగా ఫాతిమా నటించిన విషయం విదితమే.