Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత ఆరేండ్లుగా బాలీవుడ్లో విభిన్న కథా చిత్రాలు చేస్తూ రాణిస్తోంది ఇలియానా. తాజాగా ఆమె వరుసగా మూడోసారి అజరు దేవగన్‌తో కలిసి నటించబోతుంది. ఇటీవల 'బాద్షాహో', 'రైడ్' చిత్రాల్లో అజరు దేవగన్‌తో ఇలియానా ఆడిపాడిన విషయం విదితమే. ఆ మధ్య 'సోను కె టిటు కి స్వీటీ' సినిమాను రూపొందించి ఆకట్టుకున్న దర్శకుడు లవ్ రంజన్ ప్రస్తుతం అజరు దేవగన్, రణబీర్ కపూర్ ప్రధాన పాత్రధారులుగా ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు ఇద్దరు హీరోలు సుముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోందట. అందులో భాగంగా ఇలియానాను హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నారట. ఇలియానాతోపాటు అలియాభట్ పేరు కూడా వినిపించింది. కానీ ఆమె ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో ఫైనల్‌గా ఇలియానాను ఓకే చేసినట్టు చిత్ర వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఇలియానా తెలుగులో రవితేజతో కలిసి 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రంలో నటిస్తుంది.