Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని అఖిల్ హీరోగా 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్‌ను నిర్ణయించారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి(నేడు) సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్, టీజర్‌ను నాగార్జున విడుదల చేశారు. ఇందులో 'దేవదాసు' మనవడో.. 'మన్మథుడి'కి వారసుడో.. కావ్యములో కాముడో... అంతకన్నా రసికుడో' అంటూ సాగే పాట రూపంలో సినిమాలో అఖిల్ పాత్ర తీరుతెన్నులు పరిచయం చేయడం, దీంతోపాటు 'ఎక్స్‌క్యూజ్‌మి మిస్.. ఏమిటో ఈ ఇంగ్లీష్ భాష, దేన్నైతే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు' అంటూ అమ్మాయిలను ఉద్దేశించి అఖిల్ అనే డైలాగులు, 'బార్సు విల్ బి బార్సు' అని టీజర్లో వచ్చే కొటేషన్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి పతాకంపై బీవీఎస్ఎన్ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కిస్తున్నాం. అఖిత్ తాత ఏఎన్నార్ 'లైల మజ్ను'గా, తండ్రి నాగార్జున 'మజ్ను'గా నటించారు. ఇప్పుడు అఖిల్ 'మిస్టర్ మజ్ను'గా అందర్నీ అలరించడానికి సిద్ధమయ్యారు. ఇందులో అఖిల్ లుక్, నటన, స్టయిల్ అందర్ని ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.