Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్‌బాబు, నభా నటేష్ జంటగా ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పతాకంపై సుధీర్‌బాబు నిర్మించిన చిత్రమిది. ఈ నెల 21న విడుదల కానుంది. ఈసందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ, 'సాఫ్ట్వేర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు 'నన్ను దోచుకుందువటే' టైటిల్ పెట్టాడంటే దర్శకుడి స్పాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 'బాఘి' చిత్రంలో సుధీర్‌బాబు స్క్రీన్ ప్రజెన్స్‌కి, 'సమ్మోహనం' చిత్రంలో అతని నటనకు అభిమానినయ్యా. అజనీష్ ట్యూన్ సెన్స్ బాగుంది. సురేష్ ఫొటోగ్రఫీ కాంటెంపరరీగా ఉంది. నభా నటేష్ చాలా ఎక్స్‌ప్రెసివ్ హీరోయిన్. సుధీర్ ప్యాషన్‌తో సినిమాను నిర్మిస్తున్నాడు. అదే ప్యాషన్ తనను ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. తెలుగు సినిమా మారుతుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి. ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలి' అని అన్నారు. 'సుధీర్‌బాబు నా దృష్టిలో ఒక ఉత్తమ నటుడు. అతని నటనా సామర్థ్యాన్ని తెలుగు పరిశ్రమ తక్కువగా వాడుకుందని అనుకుంటున్నా. అతన పొటెన్షియల్ బయటపెట్టే మంచి కథలు రావాలి' అని మరో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెలిపారు.
హీరోసుధీర్బాబు చెబుతూ, 'మా ప్రొడక్షన్లో తొలి సినిమా. ఆర్.ఎస్.నాయుడు కథ చెప్పినప్పుడు హీరోగా, నిర్మాతగా నాకు బాగా నచ్చింది. హీరోగా చేస్తూ నిర్మాతగా చేయడం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. బాగా ఎంజారు చేశాను. నాకొక కొడుకో, కూతురో పుట్టినట్టుగా ఉంది. సినిమా అవుట్‌పుట్ చూసి హ్యాపీగా అనిపించింది. దర్శకుడు మెతక మనిషి అనుకుంటాం. కానీ సినిమా చూసిన తర్వాత ఏం చేశాడురా అనుకుంటాం. అంత చక్కగా సినిమాను డైరెక్ట్ చేశాడు. సురేష్ అద్భుతమైన విజువల్స్ అందించాడు. అజనీస్ ప్రతి పాటను డిఫరెంట్‌గా కంపోజ్ చేశాడు. అద్భుతమైన ఆర్.ఆర్తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాడు. నభా బ్రిలియెంట్ నటి. సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్' అని చెప్పారు. 'సినిమాను బాగా తీశాం. నేను పదిహేను నిమిషాల షార్ట్‌ఫిల్మ్ చూసి నచ్చడంతో సుధీర్‌బాబు ఈసినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. నటుడిగా 'సమ్మోహనం'తో తానేంటో నిరూపించారు. ఈ సినిమాతో ఆయన నటన గురించి బాగా మాట్లాడుకుంటారు' అని చిత్ర దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో సందీప్‌కిషన్, అనిల్ సుంకర, శివలెంక కృష్ణప్రసాద్, నభా నటేష్, కె.కె.రాధామోహన్, రాహుల్ రవీంద్రన్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.