Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు తెలుగులో మంచి పేరుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఇద్దరు కలవబోతున్నట్టు తెలుస్తుంది. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తర్వాత బన్నీ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. దర్శకుడు విక్రమ్ కె.కుమార్‌తో నెక్ట్స్ సినిమా ఉంటుందని బలంగా వార్తలు వినిపించాయి. మరోవైపు 'వీరం', 'వేదాలం', 'వివేగం' ఫేమ్ శివ దర్శకత్వంలో తెలుగు, తమిళంలో ఓ బైలింగ్వల్ చిత్రం చేయనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. వీటిపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా త్రివిక్రమ్ పేరు బాగా వినిపిస్తోంది. బన్నీ నెక్ట్స్ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రయోగాలకు పోకుండా మరోసారి త్రివిక్రమ్ మార్క్ చిత్రంతో రావాలని బన్నీ భావిస్తున్నారట. త్రివిక్రమ్‌తో అయితే సేఫ్ జోన్లో ఉండొచ్చని, 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' విజయాల తర్వాత హ్యాట్రిక్ హిట్ కొట్టాలని బన్నీ భావిస్తున్నారట. అయితే ఇది పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరి బన్నీ ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారనేది తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత' చిత్రాన్ని రూపొందిస్తున్నారు.