Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంజయ్ దత్, పూజా భట్ జంటగా మహేష్ భట్ దర్శకత్వంలో రూపొందిన 'సడక్' చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రొమాంటిక్ థ్రిల్లర్‌గా 1991లో విడుదలైన
ఈ సినిమా అప్పట్లో ఓ ఐకానిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
దాదాపు 27 ఏండ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ 'సడక్ 2'ను తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. అలియా భట్, ఆదిత్యరారు కపూర్ ఇందులో జంటగా నటిస్తున్నారు. గురువారం మహేష్‌భట్ తనయ, హీరోయిన్ అలియా భట్ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్‌ను, టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్లో 'సడక్' చిత్రంలోని కొన్ని సన్నివేశాలు చూపించారు. 2020 మార్చి 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రంలో మరో నటి అదితిరావు హైదరీ నటించనున్నట్టు తెలుస్తోంది. అదితి ప్రస్తుతం 'అంతరిక్షం', 'నవాబ్' చిత్రాల్లో నటిస్తోంది.