Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమన్నా తొలిసారి బయోపిక్‌లో నటించనుండటం ఓ విశేషమైతే, అలనాటి అందాల తార జయప్రదగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం మరో విశేషం. నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న బయోపిక్ 'ఎన్టీఆర్'. ఇందులో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తున్నారు. బసవ తారకంగా విద్యా బాలన్, ఏఎన్నార్‌గా సుమంత్, చంద్రబాబు నాయుడుగా రానా, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ప్రధాన కథానాయికల్లో జయప్రద ఒకరు. వీరి కాంబినేషన్లో 'సూపర్మాన్', 'అడవి రాముడు', 'చాణక్య చంద్రగుప్తా', 'యమగోల' వంటి తదితర చిత్రాలు బాక్సాఫీసు కలెక్షన్ల రికార్డుల్ని తిరగరాశాయి. జయప్రద, జయసుధ పాత్రల్లో వారే నటించే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ జయప్రద పాత్రకు తాజాగా తమన్నాను ఫైనల్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా 'ఎన్టీఆర్- కథానాయకుడు'ను జనవరి 9, 'ఎన్టీఆర్-మహానాయకుడు'ను జనవరి 24న రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం తమన్నా 'సైరా నరసింహారెడ్డి', 'ఎఫ్ 2', 'క్వీన్' రీమేక్ 'దట్ ఈజ్ మహాలక్ష్మి'తోపాటు
'దేవి 2', 'కన్నె కాలైమాన్నె' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.