Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న తెలుగు చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. మొదటి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. నయనతార కథానాయిక. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తోపాటు సుదీప్, విజరు సేతుపతి, జగపతిబాబు, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రంలోని ఆయన పాత్ర లుక్‌ను గురువారం విడుదల చేశారు. సినిమాలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ కనిపించబోతున్నారు. గురువుగా ఆయన లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పాత్రలో అమితాబ్ ఒదిగిపోయారని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలవనున్నాయట. ప్రస్తుతం జార్జియాలో పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ జరుపనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.