Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'దట్ ఈజ్ మహాలక్ష్మి'. బాలీవుడ్లో వచ్చిన 'క్వీన్'కిది రీమేక్. మీడియెంట్ ఇంటర్నేషనల్ పతాకంపై మను కుమారన్ నిర్మిస్తున్నారు. తైజాన్ ఖొరాకువాల సమర్పకులు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు.'ఇందులో తమన్నా పదహారణాల తెలుగమ్మాయి పాత్రలో నటిస్తుంది. ప్రతిష్టాత్మక ఐఫిల్ టవర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అమాయకంగా ఉండే ఓ అమ్మాయి, జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల వల్ల ఎలా శక్తివంతమైన మహిళగా మారుతుందనేది ఈ చిత్ర కథ. అమిత్ త్రివేది సంగీతం, మైఖెల్ టటూరియస్ సినిమాటోగ్రఫీ సినిమాకు అసెట్. చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటోన్న ఈ చిత్ర టీజర్‌ను త్వరలో విడుదల చేస్తాం' అని చిత్ర బృందం తెలిపింది.