Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కె.ఎల్.యూనివర్సిటీ అధినేత కోనేరు సత్యనారాయణ నిర్మాతగా ఏకకాలంలో రెండు సినిమాలు నిర్మించబోతున్నారు. నేడు (శనివారం) ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకుని నయా ప్రాజెక్ట్‌ల విశేషాలను చిత్ర బృందం తెలిపింది. రమేష్ వర్మ నిర్మాణ సారథ్యంలో ఏ స్టూడియోస్ పతాకంపై 'ఏరువాక', '16ప్లస్' చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. 'రామ్ దర్శకత్వంలో 'ఏరువాక' చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రమేష్ వర్మ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్.కె.నాయుడు సినిమాటోగ్రాఫర్. ప్రేమ సాగరంలో రెండు యువ జంటలు ఏ తీరానికి చేరుకున్నాయనే కథాంశంతో క్యూట్ లవ్ స్టోరీగా 'ఏరువాక' సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇక '16ప్లస్' విషయానికి వస్తే, టీనేజ్‌లోని ఆరుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు కలిసి చేసే ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది. సాగర్ దర్శకత్వం వహిస్తుండగా, రమేష్ వర్మ ఈ చిత్రానికి కూడా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఆరుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలుగా కొత్తవారిని పరిచయం చేస్తున్నాం. ఈ చిత్రానికి హర్షవర్థన్ మాటలు, గాంధీ ఆర్ట్, అమర్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీమణి పాటలు అందిస్తున్నారు. దీంతోపాటు ఇద్దరు స్టార్ హీరోలతో చేయబోయే సినిమాల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నాం' అని చిత్ర బృందం పేర్కొంది.