Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అమెరికాతోపాటు ఇతర దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళకు తెలుగు సినిమాల సంగీతం ఆకలిని తీర్చేందుకు 'మన రేడియో' వస్తోంది' అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ప్రపంచంలోని తెలుగు వారి కోసం 'మన రేడియో' మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. 'మన సంగీతం..మన సంస్కృతి' అనేది ట్యాగ్‌లైన్. శుక్రవారం నిర్మాత శ్యామ్ ప్రసాద్‌రెడ్డి మొబైల్ యాప్ లోగోను, హీరో అల్లరి నరేష్ రేడియో యాప్‌ను, నిర్మాత అల్లు అరవింద్ డివోషనల్ స్టేషన్‌ను లాంచ్ చేశారు. చక్రి మన రేడియో యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ, 'మన రేడియో ప్రవాస తెలుగు వారి కోసం ప్రత్యేకంగా చేశారు. ఎక్కడో ఉన్న తెలుగువారు మన జిల్లాలోని వార్తలను ఈ రేడియో ద్వారా వినవచ్చు. మొబైల్ ద్వారా కూడా వినొచ్చు. మొబైల్ దగ్గరుంటే రేడియో జేబులో ఉన్నట్టే' అని అన్నారు. 'వంశీ కడియాల నా క్లాస్మేట్. గతేడాది ఈ రేడియో ప్రారంభిద్దా మనుకున్నాం. కానీ కుదరలేదు. ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు ఆఫీసుకి వెళ్లే సమయంలో ఎక్కువ శాతం కారులో ఉండటం వల్ల ఎక్కువగా రేడియోనే వింటారు. ఎప్పుడూ ఇంగ్లీష్ స్టేషన్లు వినే వాళ్ళకి తెలుగు వింటుంటే మన ఇంటికి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది' అని అనిల్ సుంకర తెలిపారు. అల్లరి నరేష్ చెబుతూ, 'అనిల్ దాదాపుగా 18 బిజినెస్‌లు చేశారు. అన్నీ సక్సెస్ అయ్యాయి. ఇది కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా' అని చెప్పారు.