Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న సోనాక్షి సిన్హా తాజాగా ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. గుల్షన్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందనున్న బయోపిక్ 'మొఘల్'లో 1970-80
కాలానికి చెందిన మహిళగా సోనాక్షిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోగా అక్షరు కుమార్ నటించేందుకు ఒప్పుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉంటే,
సుభాష్ కపూర్ దర్శకత్వంలో భూషణ్ కుమార్, అమిర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు.
అయితే సుభాష్ కపూర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి అమిర్ ఖాన్ కూడా తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సోనాక్షి ప్రస్తుతం 'టోటల్ దమాల్', 'కళంక్', 'దబాంగ్ 3' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.