Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టాక్సీవాలా'. జి.ఎ.2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ పతాకంపై ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'విజరు దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం. విజరు ఇమేజ్‌కి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్టైన్ చేసే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. విజరు మేనరిజమ్స్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటాయి. బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తాయి. 'గీత గోవిందం' వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఏర్పడిన అంచనాలను దృష్టిలో ఉంచుకుని సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాం. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల నటనను పరిగణలోకి తీసుకుని సినిమాను గ్రాండియర్‌గా నిర్మించాం. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. సినిమాలో గ్రాఫిక్స్ చాలా కీలకం. బెటర్ క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం సినిమా విడుదల ఆలస్యమైంది. హిలేరియస్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో నవంబర్ 16న గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం' అని అన్నారు.