Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్నమైన పాత్రలకు ఇప్పుడు సమంత కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఇటీవల 'యూటర్న్'లో నవ్యమైన పాత్రలో మెప్పించిన ఆమె తాజాగా కలియుగ శూర్పణకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం. రామాయణంలో శూర్పణకది చాలా కీలక పాత్ర. రావణాసురుడి సోదరైన ఆమె రాముని పైకి రావణాసుడిని ఉసిగొల్పి యుద్ధానికి కారణమైంది. తాజాగా ఆ పాత్ర ప్రధానంగా భార్గవ్ అనే యానిమేషన్ డైరెక్టర్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. మొదట ఈ పాత్రకు కాజల్‌ను అనుకున్నారు. కాజల్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో ఈ చిత్రానికి
గ్రీన్ సిగల్ ఇవ్వలేదట. దీంతో కాజల్ స్థానంలో సమంతని చిత్ర బృందం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మహిళా ప్రధానంగా సినిమా కథ సాగుతుండటంతో ఇందులో నటించేందుకు సమంత
కూడా ఆసక్తి చూపించినట్టు చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఇందులో శూర్పణకకి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలను చూపించనున్నారట. శూర్పణక రాక్షసినే కాదు, అందమైన యువరాణి అనే విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం నాగచైతన్యతో ఓ సినిమాలో, 'సూపర్ డీలక్స్' తమిళ చిత్రంలోనూ నటిస్తోంది.