Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాజల్ ప్రస్తుతం బాలీవుడ్ 'క్వీన్' తమిళ రీమేక్ 'పారిస్ పారిస్'లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పారిస్‌లోని ఈఫిల్ టవర్ బ్యాక్‌డ్రాప్‌లో గిరక చక్రాలపై సరదాగా ఎంజారు చేస్తూ ఉన్న కాజల్ లుక్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. పరమేశ్వరిగా కాజల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంటికే పరిమితమైన ఇన్నోసెంట్ అమ్మాయి పారిస్‌కి ఎందుకు వెళ్ళిందనేది సినిమాలో ఆసక్తికరం. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రీమేక్ 'దట్ ఈజ్ మహాలక్షి'లో తమన్నా నటిస్తున్న విషయం విదితమే. ఇటీవల విడుదల చేసిన తమన్నా లుక్కు అదిరిపోయే స్పందన లభించింది. తాజాగా కాజల్ లుక్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ చిత్రాన్ని కన్నడ, మలయాళ భాషల్లోనూ రీమేక్ చేస్తున్నారు. కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం కాజల్ తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఓ సినిమాలో, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.