Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'సాహో'. ఈ చిత్రంలో ఆయన లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకుని మంగళవారం ప్రభాస్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అంతేకాదు అబుదాబిలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాల మేకింగ్ వీడియోను 'షేడ్స్ ఆఫ్ సాహో' పేరుతో ఛాప్టర్ 1గా రిలీజ్ చేశారు. సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా తెలుగు, తమిళం, హిందీలో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. 'తాజాగా విడుదలైన 'షేడ్స్ ఆఫ్ సాహో' వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఆ అంచనాలకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో, రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మాతలు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్‌తోపాటు బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేశారు. హైలీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఇటలీలో చిత్రీకరిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. నిర్మాతలు మాట్లాడుతూ, 'పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా మూడు భాషల్లో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రభాస్ గత పుట్టిన రోజున టీజర్‌ను విడుదల చేశాం. ఇండియా మొత్తం ప్రభాస్ అభిమానులు ఈ చిత్ర అప్డేట్స్ ఇవ్వాలని సోషల్ మీడియాలో కోరడంతో మా యూనిట్ వారి ఆనందాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశ్యంతో 'షేడ్స్ ఆఫ్ సాహో' పేరుతో ఛాప్టర్స్గా అందివ్వనున్నాం. అందులో భాగంగా ఈ పుట్టిన రోజున 'షేడ్ ఆఫ్ సాహో ఛాప్టర్ 1'ని విడుదల చేశాం. దీనికి అద్భుతమైన స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు 60 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ప్రభాస్ స్టయిలీష్ పర్ఫార్మెన్స్, సరికొత్త ఎనర్జీ, సుజిత్ క్లాస్ విజన్, శ్రద్ధా కపూర్ అందచందాలు బాలీవుడ్ టాప్ మ్యూజిక్ త్రయం సంగీతం, మధి గ్రాండియర్ విజువల్స్ సినిమాకు హైలైట్ కానున్నాయి' అని తెలిపారు.