Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవర కొండ
కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం..
'టాక్సీవాలా' పూర్తిగా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం. హీరో బేస్డ్ చిత్రం కాదు. కథే హీరో. అందులో మేం ట్రావెల్ అవుతుంటాం. పాత్రలు పడే ఇబ్బందులు ఆడియెన్స్‌ని నవ్విస్తాయి. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు అందరూ చూసి ఎంజారు చేసేలా ఉంటుంది. హర్రర్, అలాగే సైన్స్ ఫిక్షన్, సూపర్ నేచురల్ అంశాల మేళవింపుగా కొన్ని సన్నివేశాలుంటాయి. మాళవిక నాయర్ పాత్ర ఈ చిత్రానికి కోర్ పాయింట్. అందుకే ఆమె పాత్రను రివీల్ చేయడం లేదు. ఆన్హోల్ సినిమా బాగా నవ్విస్తుంది. సినిమా పైరసీ అయినప్పటికీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నిర్మాతలు హ్యాపీ. లీకేజ్ ప్రభావం ఎలా ఉంటుందనేది రిలీజ్ డే తెలుస్తుంది. మొదట్లో నా సినిమాలపై ఆడియెన్స్‌లో అంచనాలుంటాయనే విషయాన్ని నమ్మేవాడిని కాదు. కానీ ఉంటాయని ఇప్పుడు నాకర్థమైంది.
పోర్న్ సైట్స్లాగా బ్యాన్ చేయాలి..
'గీతగోవిందం', 'టాక్సీవాలా' వరుసగా లీక్ కావడం బాధగా ఉంది. పక్కోడు ఏమైతే మనకేంటి?, మనం ప్రయోజనం పొందుతున్నామా లేదా అని ఆలోచిస్తున్నారు. ఈ సినిమా రెండు నెలల క్రితమే మా దగ్గరికి వచ్చింది, రిలీజ్ అయిన తర్వాత పెడదామనకున్నాం. కానీ ఇతర సైట్ వాళ్ళు అప్లోడ్ చేయడంతో మేం కూడా పెట్టాల్సి వచ్చిందని సైట్ వాళ్ళంటున్నారు. అంతేకాదు సారీ చెబుతూ లెటర్స్ కూడా పెడుతున్నారు. వారిని ఏం చేయాలి?. నేను ఒంటరి. ఒక్కడిని ఏం చేయగలను?, నిస్సహాయుడిగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఆయా సైట్స్ సర్వర్స్ ఇతర దేశాల్లో ఉన్నాయి. వాటిని నిలిపివేయడం సైబర్ క్రైమ్ పోలీస్‌ల వల్ల కూడా కావడం లేదు. దీన్ని అడ్డుకోవడం కేవలం ప్రభుత్వం వల్లే అవుతుంది. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. పోర్న్ సైట్స్ బ్యాన్ చేసినట్టు వీటిని కూడా బ్యాన్ చేయాలి.
నిమా పోయినా సరే అండగా నిలుస్తా..
ఇటీవల షూటింగ్ టైమ్‌లో ఐదారేండ్లనాటి జ్ఞాపకాలను ఫ్రెండ్స్‌తో గుర్తు చేసుకున్నాను. ఓ ఫ్రెండ్ ఫోన్ చూసినప్పుడు అందులో అప్పటి ఫొటోలున్నాయి. ఛాన్స్‌ల కోసం తిరుగుతున్న రోజలవి. ఓ వైపు కెరీర్ టెన్షన్, మరోవైపు డబ్బుల టెన్షన్. చాలా ఇబ్బందుల్లో ఉండేవాడిని. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ ఫొటోలు చూస్తుంటే నన్ను నేనే గుర్తుపట్టలేకపోయా. కానీ ఇప్పుడు సినిమాలున్నాయి. పెద్ద హిట్స్ ఉన్నాయి. సినిమాలుండి పైరసీ అయితే ఏం కాదులే అనే స్థితికి వచ్చాం. ఇదే 'పెళ్ళి చూపులు' టైమ్‌లో పైరసీ జరిగితే నా సినిమా విడుదలయ్యేది కాదు. నాకు 'అర్జున్‌రెడ్డి' వచ్చేది కాదు. ఈ కెరీర్‌ను వదిలేసి ఏ డైరెక్షన్ సైడో వెళ్లిపోయేవాడిని. ఇప్పుడు కెరీర్ పరంగా చాలా బెటర్ అయ్యాను. సినిమా పోయినా నా టీమ్‌కి నేను సపోర్ట్‌గా నిలవగలను. నా బ్యానర్లో మరో సినిమా చేయగలను. ఈ సినిమాకు పనిచేసిన దర్శకుడు, కెమెరామెన్ చాలా టాలెంటెడ్. సినిమా కోసం వాళ్ళెన్నో ఇబ్బందులు పడుతూ పనిచేశారు. ఈ సినిమా అటు ఇటు అయినా సరే వారికి మరో ఛాన్స్ ఇచ్చి అండగా నిలుస్తాను.
ఫీల్డ్‌ని వదిలేసి వెళ్ళిపోదామనుకున్నా..
హీరోలంటే అంతా బాగుంటుందనుకుంటారు. స్టేజ్‌పై ఫన్ చూసి వారికేం బాగానే ఉంటారనేది అందరి అభిప్రాయం. కానీ దాని వెనకాల చాలా ఇబ్బందులుంటాయి. 'నోటా' ప్రమోషన్ టైమ్‌లో సడెన్‌గా మా అమ్మ ఆసుపత్రిలో చేరారు. దీంతో విపరీతమైన ఆందోళన, టెన్షన్. ఆసుపత్రికి వెళ్తున్నప్పుడు సినిమాల్లోంచి వెళ్ళిపోవాలనుకున్నాను. మా నిర్మాతలకు ఫోన్ చేసి నాకు సినిమాలు వద్దు, ఇమేజ్ వద్దు, నేను దీన్ని వదిలేద్దామనుకుంటున్నానని చెప్పాను. ఆ తర్వాత మా అమ్మ కోలుకున్నారు. ఒక చిన్న సమస్యతోనే నేను అంతగా రియాక్ట్ అయ్యాను, కానీ ఈ చిత్ర సంగీత దర్శకుడు జేక్స్ ఫాదర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఓ వైపు తండ్రికి కీమో థెరఫీ చేయిస్తూ మరోవైపు నా సినిమాకు పనిచేశాడు. అలాగే కెమెరామెన్ సుజిత్ మెడ నొప్పితో బాధపడుతూ సినిమా చేశాడు. అందుకే వారికి సపోర్ట్నివ్వాలి.
తెలిసినా ఏం చేయలేని స్థితి..
'నోటా' సినిమా టైమ్‌లో ఓ వైపు 'గీతగోవిందం', మరోవైపు 'నోటా', 'టాక్సీవాలా' వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా. రోజూ ఒకదాని తర్వాత మరొక సినిమాకు తిరుగుతూ తీరిక లేకుండా గడిపాను. ఏ సినిమా ఎలా వస్తుందో చూసుకోలేని స్థితిలో ఉన్నా. 'నోటా' సినిమాని విడుదల ముందు రోజు చూశా. కొన్ని తప్పులు కనిపించాయి. అయితే అప్పుడు ఏం చేయలేని పరిస్థితి. దేనికైనా కొంత సమయం కావాలనిపించింది. ఇకపై ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా చేయాలనుకుంటున్నా. కానీ ఇప్పుడు కుదరడం లేదు. ఇప్పటికే కమిట్మెంట్స్ ఉన్నాయి. నెక్ట్స్ ఇయర్ నుంచైనా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటా. 'నోటా' సినిమా పోయినప్పుడు నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం కామన్. ఎవరికుండే అభిప్రాయాలు వారికుంటాయి. వాటిని కాదనను. కానీ చాలా మంది సోషల్ మీడియాలో బూతులు తిట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు. అది చూసి నా అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నా. అందుకే 'రౌడీస్ పండగ చేసుకోండి. మళ్ళీ వస్తా' అని పెడ్తే అదీ కాస్త ఎటేటో పోయింది.
అది వారి పెద్దతనం..
నాకు వచ్చిన ఇమేజ్‌తో ఇతర హీరోల్లో జెలసీ ఉంటుందనేది నాకు తెలుసు. దాన్ని నేను పట్టించుకోను. ఇతర హీరోలను కలవను. నా టీమ్, నా ఫ్రెండ్స్‌తోనే ఉంటా. నా పని నేను చేసుకుంటా. ఎవరి పని వారు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం. అయితే నా సినిమా ఫంక్షన్లకు చిరంజీవి, బన్నీ అన్న వచ్చి నన్ను స్టార్ అంటూ ప్రశంసించడం గొప్ప విషయం. ఆ విషయంలో వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అది వారి పెద్దతనం. కానీ నేను ఆ ప్రశంసలకు దూరంగా ఉండాలనుకుంటున్నా. నిజం చెప్పాలంటే ఒకప్పుడు నేను యాక్టర్ అవుతానని నాకే తెలియదు. కానీ ఇప్పుడు యాక్టరై చిరంజీవి వంటి పెద్ద హీరోతో స్టేజ్‌ను షేర్ చేసుకోవడం నమ్మలేకపోతున్నా. దాని గురించి ఆలోచిస్తే ఎక్కడికో పోతాం. అందుకే దాన్ని మరచిపోవాలనుకుంటున్నా.
నెక్ట్స్ పెద్ద డైరెక్టర్స్‌తో చేస్తా..
మొదట్నుంచి నా దగ్గరకు అంతా కొత్త దర్శకులే రావడం, వారి కథలు నచ్చడంతో వరుసగా సినిమాలు చేశా. అలాగే పెద్ద దర్శకులు కూడా అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు బిజీగా ఉండి ఇంకా కన్ఫమ్ చేయలేదు. నెక్ట్స్ ఇయర్ అగ్ర దర్శకులతో చేస్తా. అలాగే కెరీర్ ప్రారంభంలో సినిమాల్లోకి ఎలా రావాలో అర్థం కాక, మొదటి ఛాన్స్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్, యాక్టర్స్‌ని ప్రోత్సహించేందుకు ప్రొడక్షన్ ప్రారంభించాలనుకున్నా. మంచి కథలను ప్రోత్సహిస్తాను. రెగ్యులర్‌గా కాకుండా సమయాన్ని, వచ్చిన స్క్రిప్ట్స్‌ని బట్టి సినిమాల్ని నిర్మిస్తా. దీని కోసమై ప్రస్తుతం వర్క్ జరుగుతోంది. ఆ టైమ్‌లో జరిగితే కెరీర్ ఖతమయ్యేది