Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైజాగ్ గోవింద్, ప్రియ జంటగా ఆర్.కె.గాంధి దర్శకత్వంలో ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లిఖి, టఖి సమర్పణలో గౌరీశంకర్ నిర్మిస్తున్న చిత్రం 'ఆత్మబంధం'. ఈ చిత్ర ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ ట్రైలర్, ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఆద్యంతం ఎంగేజింగ్‌గా సినిమా సాగుతుంది. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. కచ్చితంగా అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు ఆనంద్ భారతి, వరంగల్ భాష పాల్గొన్నారు. ఫిష్ వెంకట్, ఉదరు, గీతాసింగ్, ఉదరు రెడ్డి, శంకర్.ఎ.ఎల్. మురళీకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గంటాడి కృష్ణ.