Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను ఈ స్థాయిలో ఉండటానికి అసాధారణమైన కథల ఎంపికే కారణం. నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణించగలుగుతున్నాను' అని అంటోంది అనుష్క శర్మ. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టి ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌లో నటించింది అనుష్క. అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ఖాన్ త్రయంతోపాటు ఇతర అగ్ర కథానాయకులతోనూ నటించి మెప్పించింది. విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ సత్తా చాటుతోంది. 'బ్యాండ్ బాజా బారత్', 'పాటియాలా హౌస్', 'జబ్ తక్ హై జాన్', 'పీకే', 'ఎన్‌హెచ్ 10', 'బాంబేవాల్వేట్', 'సుల్తాన్', 'ఫిల్హౌరి', 'సంజు' చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం 'జీరో' చిత్రంలో నటిస్తుంది. ఇండిస్టీలోకి అడుగుపెట్టి ఈ బుధవారంతో అనుష్క పదేండ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంటుంది. 'రబ్ నే బనా ది జోడి' (2008 డిసెంబర్ 12) చిత్రంతో అనుష్క బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం విదితమే. నటిగానే కాదు, నిర్మాతగా పలు అభిరుచిగల సినిమాలను నిర్మించారు. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని పెళ్ళి చేసుకున్నారు. విజయవంతంగా పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనుష్క తన కెరీర్ గురించి విశ్లేషిస్తూ, 'నేను మొదట్నుంచి సినిమాల విషయంలో అసాధారణమైన ఎంపికతోనే సాగుతున్నా. కెరీర్ పరంగా కూడా విభిన్న ప్రమాణాలను ఫాలో అవుతున్నాను. రిస్క్‌లూ తీసుకున్నా. మనం ఎదిగేందుకు లక్ కూడా కలిసి రావాలనేది నమ్ముతాను. దీనికితోడు నేను 24 గంటలూ పనిచేస్తాను. మంచి సినిమాలు ఎంపిక చేసుకునేందుకు టైమ్‌ను కేటాయిస్తాను. నా పదేండ్ల జర్నీ చాలా విజయవంతంగా సాగింది. కెరీర్ పరంగా ఇప్పుడు నేను చాలా సెక్యూర్డ్‌గా ఉన్నా. నాకు నచ్చిన, నాకు కావాల్సిన సినిమాలు చేస్తున్నాను' అని తెలిపారు.