Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా ప్రారంభమయ్యేంత వరకు ఏ సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తున్నారనేది క్లారిటీ ఉండదు. స్టార్ట్ అయ్యే లోపు చాలా మంది కథానాయికల పేర్లు వినిపించినప్పటికీ రోజుకొక పేరు మారిపోతుంటుంది. అంతా ఓకే అనుకున్నా, చివరి నిమిషంలో ఛాన్స్ కోల్పోవడమో, ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడమో జరుగుతుంటుంది. తాజాగా తాప్సీ విషయంలో కూడా ఇప్పుడదే జరిగింది. బాలీవుడ్లో అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందే సినిమాలో తనూ ఓ కథానాయికగా నటిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఇందులో ఇప్పటికే సైఫ్ అలీఖాన్, అభిషేక్ బచ్చన్, రాజ్ కుమార్‌రావ్, సోనాక్షి సిన్హా కన్ఫమ్ అయ్యారు. వీరితోపాటు తాప్సీ, ఇషాన్ ఖత్తర్(దఢక్ ఫేమ్) నటిస్తున్నట్టు తెలిసింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ ఇద్దరు తప్పుకున్నారట. తాప్సీ డేట్స్ ఇష్యూ వల్ల ఈ ప్రాజెక్ట్ వదులుకుందని, ఇషాన్ తప్పుకోవడానికి కారణమేంటనేది తెలియరాలేదట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, తాప్సీ ప్రస్తుతం 'తడ్కా', 'బద్లా', 'మిషన్ మంగళ్', తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం 'గేమ్ఓవర్'లో నటిస్తున్నారు.