Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా నందిత శ్వేత కీలక పాత్రలో హరికిషన్ దర్శకత్వంలో ఆర్.పి.ఏ. క్రియేషన్స్ పతాకంపై ఆర్.సుదర్శన్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమ కథా చిత్రమ్ 2'. గతంలో వచ్చిన 'ప్రేమ కథా చిత్రమ్'కి ఇది రీమేక్. ఈ చిత్ర హిందీ శాటిలైట్, డబ్బింగ్రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయాయి. ఈ సందర్భంగా నిర్మాత సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, ''ప్రేమకథా చిత్రమ్' ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు. సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా కూడా అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. హిందీ శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ కోటి నలభై మూడు లక్షలకి అమ్ముడు పోవడం విశేషం. ఈ చిత్రంలో నందిత శ్వేత మెయిన్ హీరోయిన్గా కనువిందు చేయనుంది. అలాగే సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జోడీ అలరిస్తుంది. విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీనుల మధ్య వచ్చే కామెడీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అతి త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. పూర్తి సర్ప్రైజింగ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది' అని అన్నారు. కృష్ణతేజ, ఎన్.టివి. సాయి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి, సంగీతం: జె.బి.