Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొవెరా, హిమాన్షి కాట్రగడ్డ జంటగా కొవెరా క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి నాగానిక సమర్పణలో విజయలక్ష్మి కొండా నిర్మిస్తున్న చిత్రం 'యు'. కొవెరా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'కథే హీరో' అనేది ట్యాగ్‌లైన్. శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కొవెరా మాట్లాడుతూ, 'నెల 28న విడుదల చేయబోతున్నాం. ఇలాంటి ఆలోచనతో కూడా సినిమాలు చేయొచ్చా అనే విధంగా గొప్పగా సినిమా ఉంటుంది. దర్శకుడు శంకర్ రూపొందించిన 'భారతీయుడు', 'జెంటిల్‌మేన్'ల స్ఫూర్తితోనే చిత్రాన్ని రూపొందించాను. వంద కోట్లతో తెరకెక్కించాల్సిన సినిమాను కోటి రూపాయలతో తెరకెక్కించా. అయినా అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన బాలాజీ నాగలింగంకి ధన్యవాదాలు' అని అన్నారు. 'చిన్న సినిమాలు విడుదల చేయాలంటే చాలా కష్టం. సినిమా కాన్సెప్ట్ బాగా లేకపోతే డబ్బులు రావు. మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాలకే ఆదరణ ఉంటుంది. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉందనిపిస్తుంది. టైటిల్, ట్రైలర్ డిఫరెంట్‌గా బాగున్నాయి. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి ముత్యాల రాందాస్ తెలిపారు. 'అవినీతి, అక్రమాలు ప్రధాన ఇతివృత్తంగా సందేశాత్మకంగా ఈ సినిమా రూపొందింది. కొవెరా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించడం గొప్ప విషయం. సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాం' అని బాలాజీ నాగలింగం తెలిపారు.