Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్ట్ డైరెక్టర్ అశోక్. కె దర్శకుడిగా పరిచయమవుతూ 'ఇష్టంగా' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఏ.కె.మూవీస్ పతాకంపై ఆషా అశోక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ, 'దర్శకుడు అశోక్ ఆర్ట్ డైరెక్టర్‌గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 150 సినిమాలకు పనిచేశారు. ఐదు సినిమాలకు నంది అవార్డులను కూడా అందుకున్నారు. తెలుగులో 'బొబ్బిలిరాజా', 'మాస్టర్', 'డాడి', 'టక్కరి దొంగ', 'అంజి', 'యమదొంగ', 'ఒక్కడు', 'గంగోత్రి', 'పౌర్ణమి', 'అరుంధతి', 'వరుడు' వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేసి తన ప్రతిభను చాటుకున్నారు' అని అన్నారు. 'యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ఇది. ఆకట్టుకునే ప్రేమ కథ. త్వరలోనే ఆడియోను, ఆ వెంటనే సినిమాను రిలీజ్ చేస్తాం. దర్శకేంద్రుడు మా చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడులద చేసి మమ్మల్ని అభినందించడం ఆనందంగా ఉంది. సినిమా విజయం పట్ల ధీమాగా ఉన్నాం' అని దర్శకుడు అశోక్ అన్నారు.