Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలు దర్శకత్వంలో బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై హిమ బిందు వెలగపూడి నిర్మిస్తున్న నయా చిత్రం సోమవారం ప్రారంభమైంది. త్రిదా చౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధి ఇద్నాని, కొమలి ప్రసాద్ ప్రధాన పాత్రధారులు. ఈ సందర్భంగా దర్శకుడు బాలు మాట్లాడుతూ, 'నలుగురు హీరోయిన్లతో సాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. మహానగరంలో నివసిస్తూ స్వతంత్ర భావాలున్న నలుగురు అమ్మాయిలకి సంబంధించిన కథ ఆసక్తికరంగా ఉంటుంది. త్రిదా చౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధి ఇద్నాని, కొమలి ప్రసాద్ నలుగురు అమ్మాయిలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కథానుగుణంగా వచ్చే మలుపులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి' అని అన్నారు. 'సోమవారం నుంచే హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్‌ని జరుపుతున్నాం. ఫిబ్రవరిలో గోవాలో సెకండ్ షెడ్యూల్‌ని చిత్రీకరిస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే నెలలో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, సినిమాటోగ్రఫీ: శేఖర్ గంగమోని, ఎడిటింగ్: నాగేశ్వర్‌రెడ్డి.