Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇద్దరు ప్రేమికులు కలిసి ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?, తమకి ఎదురైన సమస్యల నుంచి ఎలా భయటపడ్డారనేది తెలియాలంటే 'కొత్తగా మా ప్రయాణం' సినిమా చూడాల్సిందే' అని అంటున్నారు హీరో ప్రియాంత్. రమణ దర్శకత్వంలో ప్రియాంత్, యామిని భాస్కర్ జంటగా నటించిన చిత్రం 'కొత్తగా మా ప్రయాణం'. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ప్రియాంత్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'చిన్నప్పట్నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. గ్రాడ్యూయేట్ పూర్తి చేసి ఓ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నా. గత ఐదారేండ్లుగా సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ ట్రయల్స్‌లో భాగంగా 'ఈ వర్షం సాక్షిగా' ఫేమ్ రమణ మంచి కథ తీసుకొచ్చారు. బాగా నచ్చింది. మా స్నేహితులు నిర్మాణంలో భాగమయ్యారు. దీంతో నేను కూడా దగ్గరుండి ప్రొడక్షన్ చూసుకోవాల్సి వచ్చింది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రమిది. సాఫ్ట్వేర్ కల్చర్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో నా పేరు కార్తిక్. నలుగురికి హెల్ప్ చేసే మనస్థత్వం నాది. ఓపెన్ మైండెడ్తో ఉంటాను. ప్రేమ, పెళ్ళి, ఫ్యామిలీ రిలేషన్స్‌పై పెద్దగా నమ్మకం లేదు. అనుకోకుండా నాకు ఓ అమ్మాయి నచ్చుతుంది. ఓపెన్ మైండ్‌తో ఉన్న నేను ఆమెతో ప్రేమ విషయం చెబుతా. మేమిద్దరం కలిసి ఉండాల్సి వస్తుంది. దీని వల్ల ఇతరులతో ఎలాంటి సమస్యలు వచ్చాయి, వాటిని ఎలా ఎదుర్కొన్నామనేది కథ. నేటి సమాజంలో యువత, సాఫ్ట్వేర్ ధోరణులను తెలిపే చిత్రమిది. స్నేహానికి, సహజీవనానికి తేడాని తెలియజేస్తుంది. రిలేషన్స్, కల్చర్ ప్రాధాన్యతని తెలియజేస్తుంది. మన సంస్కృతిని మర్చిపోవద్దని చెప్పబోతున్నాం. అంతిమంగా పెళ్ళికాని వాళ్ళు కలిసి ఉండటం తప్పు అనేది చెబుతున్నాం. ఇందులో మంచిని చెప్పే క్రమంలో కాస్త గ్లామర్, రొమాన్స్ సన్నివేశాలు చూపించాల్సి వచ్చింది. కాకపోతే ఆయా సన్నివేశాలు హద్దుల్లోనే ఉంటాయి. కీర్తిగా యామిని భాస్కర్ బాగా నటించింది. నాకిది హీరోగా తొలి సినిమా. నటనలో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. డైరెక్ట్‌గా నటించేశా. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు అభినందించారు. యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పారు. ఆడియెన్స్‌కి కూడా కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నా. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నెక్ట్స్ ప్రసాద్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నా. చదువు పూర్తి చేసుకుని బేవర్స్‌గా తిరిగే యువకుడి కథాంశంతో సాగే చిత్రమది. ఫిబ్రవరి ఎండింగ్లో ప్రారంభమవుతుంది. మున్ముందు సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాల్లో నటిస్తాను' అని అన్నారు.