Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రస్తుతం గ్రేట్ మ్యాన్ కపిల్ దేవ్‌ని ఆవాహన చేసుకునే పనిలో ఉన్నాను. ఆయన పాత్రలో నటించేందుకు ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను' అని అంటున్నారు రణ్వీర్ సింగ్. 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా క్రికెట్ వరల్డ్ కప్‌ని సాధించిన విక్టరీ నేపథ్యంలో '83' పేరుతో సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో కపిల్ దేవ్‌గా రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకుడు. ఈ చిత్రం కోసం రణ్వీర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే సిద్ధు దగ్గర బౌలింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం కపిల్‌దేవ్ దగ్గరే క్రికెట్‌కి సంబంధించి, ఆయన పాత్రకి సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దాదాపు మూడు వారాల పాటు కపిల్‌తో ఈ ట్రైనింగ్ సెషన్ ఉంటుందట. ఈ సందర్భంగా రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ, 'కపిల్ సార్‌తో టైమ్ స్పెండ్ చేయబోతున్నా. ఈ క్రమంలో నేను ఆయనలా మారనున్నా. ఆయనతో గడిపే సమయంలో కపిల్ సార్ కథని, అనుభవాన్ని, ఆలోచనలను, అనుభూతులను, హావభావాలను, ఆయన శక్తిసామర్థ్యాలని గమనించనున్నా. వీటితోపాటు ఆయన బ్యాటింగ్, బౌలింగ్ చేసే తీరును, నమ్మకాన్ని, పాజిటివ్ మైండ్‌సెట్‌ని, మ్యాచ్‌లో వ్యవహరించే తీరుని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆయనగా మారేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నాను' అని తెలిపారు. రణ్వీర్ నటించిన 'గల్లీబాయ్' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.