Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్యాణ్ రామ్, షాలినీ పాండే జంటగా కె.వి.గుహన్ దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ ఎస్.కోనేరు నిర్మిస్తున్న చిత్రం '118'. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'చందమామే.. చేతికందే..' అంటూ సాగే పల్లవిగల పాటను ఇటీవల విడుదల చేశారు. ఇది చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ, 'ఈ పాటను యాజిన్ నిజార్ గొంతుతో వినే కొద్దీ వినాలనిపించేలా చాలా చక్కగా ఉంది. బ్రహ్మచారి తన బాధని చూడమంటూ ప్రియురాలికి మొర పెట్టుకుంటున్నాడని వినే వారికి ఇట్టే అర్థమై బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే ప్రస్తుతం ట్రెండింగ్ అయ్యింది. రామ్ ఆంజనేయులు ఈ పాట రాశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడుదలవుతున్నాయి. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మంచి ట్యూన్స్ ఇచ్చారు. తప్పకుండా ఆడియో పెద్ద హిట్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన స్టిల్స్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్రెష్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. కళ్యాణ్‌రామ్ లుక్స్ పరంగా ఇప్పటికే సరికొత్తగా కనిపిస్తున్నారు. ఆయన కెరీర్లో ఇదొక మంచి కమర్షియల్ చిత్రమవుతుంది. షాలినీ పాండే గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తోంది. సినిమా చాలా బాగా వచ్చింది. టైటిల్ కూడా చాలా ఆసక్తికరంగా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు. సినిమాని మార్చి 1న విడుదల చేస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: తమ్మిరాజు.