Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మా చిత్ర ట్రైలర్ చూసి వెంకటేష్ ప్రశంసించారు. నాకు చాలా సలహాలిచ్చారు. మాట్లాడిన కొద్దిసేపైనా ఓ యాక్టింగ్ క్లాస్లా అనిపించింది' అని అంటున్నారు ఈశ్వర్. ఆయన హీరోగా నటించిన చిత్రం '4 లెటర్స్'. రఘురాజ్ దర్శకత్వంలో ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ పతాకంపై ఉదరు కుమార్ దొమ్మరాజు నిర్మించారు. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఈశ్వర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఇండియా వెళ్ళి సినిమాల్లో ట్రై చేస్తానని ఇంట్లో చెప్పా. లక్కీగా మా ఫ్యామిలీకి కూడా సినిమాలంటే ఇష్టం. దీంతో నాకు చాలా ఈజీ అయ్యింది. ఇతర బ్యానర్స్‌లో నటించడమెందుకు మనమే బ్యానర్ పెట్టి నిర్మిద్దామని ఎంతగానో సపోర్ట్ చేశారు.
వైజాగ్ సత్యానంద్ దగ్గర మూడు నెలల పాటు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నా. అమెరికాలో ఉన్నప్పుడు పలు స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఆ అనుభవం చాలా ఉపయోగపడింది. అంతేకాదు 'ఆ ఇద్దరూ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించాను. నాకు మంచి పేరు తెచ్చింది.
కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జీవితం ఎలా ఉంటుందన్న కథాంశానికి లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు. స్టూడెంట్స్ తలచుకుంటే ఏమైనా చేయగలరనే సందేశానిచ్చాం. విద్యార్థులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. డైలాగ్స్‌లోనే కామెడీని జనరేట్ చేశాం. విజువల్‌గా వల్గారిటీ ఉండదు. ప్రజెంట్ యూత్ ఎలా బిహేవ్ చేస్తున్నారో, వారెలా మాట్లాడుకుంటున్నారో చాలా నేచురల్‌గా ఉంటుందే తప్ప వాంటెడ్‌గా డబుల్ మీనింగ్ డైలాగ్‌లు పెట్టలేదు.
దర్శకుడు రఘురాజ్ ఫుల్ స్క్రిప్ట్, లొకేషన్స్, షెడ్యూల్స్‌తో సహా వచ్చి కథ చెప్పారు. ఫస్ట్ సిట్టింగ్‌లోనే మా అందరికి నచ్చింది. ఆయనకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పది సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉంది. షూటింగ్లో ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. నా పాత్రకి బాగా డబ్బింగ్ చెప్పానన్నా, మంచి నటనని ఇవ్వగలిగానన్నా ఆయనే కారణం. డైలాగ్స్ చాలా కొత్తగా రాశారు. స్క్రీన్‌ప్లే కూడా కొత్తగా ఉంటుంది.
మా సొంత బ్యానర్లో సినిమా చేయడం చాలా కంఫర్ట్‌గా అనిపించింది. అయితే ఇంట్లోనే రిలేషన్స్. సెట్లో అందరం చాలా ప్రొఫెషనల్‌గా ఉండేవాళ్ళం. మా నాన్నే నిర్మాత కావడంతో ప్రొడక్షన్ గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం వెళ్ళడంతో అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రెండు మాస్, రెండు వెస్ట్రన్ సాంగ్స్ ఉంటాయి. పాటలకి మంచి స్పందన లభిస్తోంది. నాకు చిన్నప్పట్నుంచి మ్యూజిక్ ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇందులో ఓ పాట కూడా పాడాను. దానికి అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాటోగ్రఫీ, గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్.
సినిమా విడుదలవుతుందంటే కొంచెం టెన్షన్‌గా ఉంది. కానీ నేను ఏ పనిచేసిన వంద శాతం ఎఫర్ట్ పెడతా. కాబట్టి కచ్చితంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది. సినిమా హిట్ అయితే నాన్నకి నేనిచ్చే రిటన్ గిఫ్ట్ అవుతుంది. నాతో పాటు కొత్తవాళ్ళకి ఛాన్స్లిస్తూ మా బ్యానర్లో సినిమాలు చేస్తాం. అందులో భాగంగా ప్రస్తుతం పలు కథలు వింటున్నాం. ఈ సినిమా రిలీజ్ అయ్యాక తదుపరి సినిమాని ప్రకటిస్తాం. ఇకపై సినిమాకే నేను పూర్తిగా అంకితం అవుతాను.