Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఊపిరి' తర్వాత నాగార్జునకి సరైన విజయం దక్కలేదు. 'రాజుగారి గది 2', 'దేవదాస్' చిత్రాలు మిశ్రమ ఫలితాలను రాబట్టాయి. 'ఓం నమో వెంకటేశాయా', 'ఆఫీసర్' బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మిగిలాయి. ఈ నేపథ్యంలో తదుపరి చిత్రాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం 'బ్రహ్మాస్త్ర'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే 'మన్మథుడు 2' చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించబోయే చిత్రమిది. సూపర్ హిట్ 'మన్మథుడు' చిత్రానికి ఇది సీక్వెల్. తాజాగా దీనికి ఓ తేదీని ఫిక్స్ చేసినట్టు సమాచారం. మార్చి 12న సినిమాని ప్రారంభించబోతున్నారనే వార్త ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యింది.
సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ యూరప్‌లో ఉంటుందని, దాదాపు రెండు నెలలు అక్కడే చిత్రీకరణ జరుగుతుందని కూడా తెలుస్తోంది. మరి ఇందులో కథానాయికలుగా ఎవరు నటిస్తారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. నాగార్జున ఈచిత్రంతోపాటు 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్‌గా 'బంగార్రాజు' చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సూపర్ డూపర్ హిట్ చిత్రాల సీక్వెల్స్తోనైనా నాగార్జునకి విజయం దక్కుతుందో లేదో చూద్దాం.