Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరలక్ష్మి, కేథరిన్, లక్ష్మీరారు ప్రధాన పాత్రధారులుగా జై హీరోగా ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నాగకన్య'. జంబో సినిమాస్ పతాకాలపై ఏ. శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇటీవల రిలీజ్ అయిన కథానాయికల ఫస్ట్‌లుక్స్‌కి మంచి స్పందన లభించింది. ఇక ట్రైలర్ చూసిన వారంతా అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. పేరున్న హీరోయిన్స్, గ్రాండ్ విజువల్స్, రిచ్ గ్రాఫిక్స్, క్యూరియాసిటీతో కూడిన కథనంతో ఈ ట్రైలర్‌ని విడుదల చేశాం. స్పందన పట్ల చాలా హ్యాపీగా ఉంది. నాగసర్పం నేపథ్యంలో సినిమా సాగుతుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. జై పాత్ర మరో హైలైట్‌గా నిలుస్తుంది. దర్శకుడు సురేష్ స్టోరీ, స్క్రీన్‌ప్లే క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తాం. వరలక్ష్మి, కేథరిన్, లక్ష్మీరారు పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి పాత్రకి మంచి పేరొస్తుంది. వేసవి కానుకగా సినిమాని విడుదల చేస్తున్నాం' అని అన్నారు.