Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్‌పై హలీవుడ్ క్రేజీ స్టార్ విల్‌స్మిత్ ప్రశంసల వర్షం కురిపించారు. రణ్వీర్ నటించిన 'గల్లీబారు' తనకెంతో బాగా నచ్చిందట. ఈ సందర్భంగా ఓ వీడియోని విల్ స్మిత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. 'రణ్వీర్ నీకు శుభాకాంక్షలు. 'గల్లీబారు' చిత్రంలో నువ్వు చేసిన నటన నాకు బాగా నచ్చింది. ఆ మూమెంట్స్ నాకు ఓల్డ్ స్కూల్ హిప్ హప్ని గుర్తు చేశాయి. నీకు అభినందనలు మ్యాన్' అంటూ వీడియోని షేర్ చేశారు. అది తన అభిమానుల ద్వారా రణ్‌వీర్‌కి చేరింది. దీనిపై రణ్వీర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో రణ్వీర్ ముంబయిలోని దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మురాద్ అనే యువకుడిగా నటించారు. ర్యాపర్‌గా రాణించేందుకు పడే స్ట్రగుల్స్ నేపథ్యంలో సినిమా రూపొందింది. జోయా అక్తర్ దర్శకత్వంలో రూపొందిన 'గల్లీబారు' చిత్రం ఈ నెల 14న విడుదలయ్యింది. రణ్వీర్ ప్రస్తుతం '83', 'తఖ్త్' చిత్రాల్లో నటిస్తున్నారు.