Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెగా కాంపౌడ్ వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తోంది నిహారిక. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి 'ముద్దపప్పు అవకాయి' వెబ్ సిరీస్ చేసింది. ఆ తర్వాత 'ఒక మనసు'తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. గతేడాది 'హ్యాపీ వెడ్డింగ్' చిత్రంలో నటించి అందరినీ అలరించినప్పటికీ సక్సెస్‌ని మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం 'సూర్యకాంతం' చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఆమె ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్టు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో నటించే లక్కీ ఛాన్స్‌ను నిహారిక దక్కించుకుందట. సుకుమార్ రైటింగ్స్‌లో రూపొందే ఓ చిత్రంలో నిహారిక ఫైనల్ అయినట్టు, దీనికి సుకుమారే దర్శకత్వం వహిస్తారని సమాచారం.