Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జొన్నలగడ్డ హరికృష్ణ, అక్షిత జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ప్రేమెంత పనిచేసే నారాయణ'. జెఎస్ఆర్ మూవీస్ పతాకంపై సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు. యాజమాన్య సంగీతం అందించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది.
అతిథిగా విచ్చేసిన హీరో శ్రీకాంత్ మొదటి జ్ఞాపికని యాజమాన్యకి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'శ్రీనివాసరావు చాలా సంవత్సరాలుగా తెలుసు. తనకి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు. చాలా సినిమాలకి పనిచేసిన అనుభవం ఉంది. మంచి టెక్నీషియన్. వాళ్ళబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ తనే అన్ని బాధ్యతలు తీసుకుని, ఎన్ని కష్టాలు ఎదురైనా ఫ్యాషన్‌తోనే శ్రమించాడు. హరిలో మంచి జీల్ ఉంది. సినిమా కోసం
తను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు. భవిష్యత్‌లో మంచి స్టార్ అవుతాడు' అని అన్నారు. 'కథని నమ్మి చేసిన చిత్రమిది. ఈ కథ గురించి కొందరికి చెబితే కొన్ని సలహాలిచ్చారు. కానీ అవేవి నాకు నచ్చలేదు. నేను తీయాలనుకున్నది తీశా. బాగా వచ్చిందని నమ్ముతున్నా. హిందీ డబ్బింగ్ రైట్స్‌కి కూడా మంచి ధర పలికింది. అల్లు అరవింద్ సినిమాకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా' అని దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తెలిపారు. హీరో హరికృష్ణ చెబుతూ, 'ఇది రెగ్యులర్ లవ్ స్టోరీకి భిన్నంగా ఉండే పెయిన్ఫుల్ స్టోరీ. ప్రేమకు కొత్త అర్థం చెబుతుంది. ప్రేమ అంటే అమ్మాయి, అబ్బాయి ఉంటే సరిపోతుందనుకుంటారు. కానీ స్నేహితుడు లేకపోతే ప్రేమ లేదని, స్నేహితుడి విలువని చెప్పే చిత్రమిది. క్లైమాక్స్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది' అని చెప్పారు. 'రొటీన్‌కి భిన్నమైన చిత్రమిది. రియలిస్టిక్‌గా ఉంటుంది. చాలా సన్నివేశాలు ఎమోషన్‌తో నడుస్తాయి' అని హీరోయిన్ అక్షిత తెలిపారు.