Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమన్నా కొంతకాలంగా పంథా మార్చారు. గ్లామర్ పాత్రలే కాకుండా పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'కాన్నె కాలైమానె'. ఉదయనిధి స్టాలిన్ హీరోగా శీను రంగస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ నెల 22న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను తమన్నా పంచుకుంది. ''మధురై' బ్యాక్డ్రాప్లో సాగే చిత్రమిది. ఇందులో నేను శక్తివంతమైన మహిళా పాత్రలో నటించాను. సినిమాకి చాలా కీలకంగా ఉంటుంది. రైతుల సమస్యలను చర్చించే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తుందని నమ్ముతున్నా. నన్ను దర్శకుడు శీను రంగస్వామి అర్థం చేసుకున్నట్టు మరే దర్శకుడు అర్థం చేసుకోలేదు. నా పాత్రని అంత బాగా డిజైన్ చేశారు' అని తమన్నా తెలిపింది. 'సైరా నరసింహారెడ్డి', 'దట్ ఈజ్ మహాలక్ష్మి', 'దేవి 2' వంటి తదితర చిత్రాల్లో నటిస్తూ తమన్నా బిజీగా ఉన్నారు.