Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ సినిమాలకి పనిచేస్తున్న పాకిస్తాన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లపై బ్యాన్ విధించారు. పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ పాక్ కళాకారుల్ని నిషేధిస్తున్నట్టు ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీన్ని ఉల్లంఘించిన వారిని నిషేధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సల్మాన్ నటిస్తున్న 'భారత్' చిత్రంలో పాటలు పాడుతున్న పాకిస్తాన్ గాయకులు ఆతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్లను ఇప్పటికే తొలగించారు. వీరితోపాటు మహీరాఖాన్, ఫవాద్ ఖాన్లు కూడా భారతీయ సినిమాలకు పని చేయకూడదని తెలిపారు.
యువ కథానాయకుడు నాగ అన్వేష్ లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించారు. 'అమరవీరుల కుటుంబాల శోకం తీర్చలేనిది. కానీ ఆ కుటుంబాలకి మన వంతుగా సహాయం చేసి, మన భారతీయులందరూ మన గురించి ఆలోచిస్తున్నారు. మన వైపు నిలబడ్డారని వారికి భరోసా ఇవ్వాలి. అందరి సాయం ఆ కుటుంబాలకి అందేలా మీడియా వెసులుబాటు కలిగించి సహకరించాలి' అని నాగ అన్వేష్ చెప్పారు.