Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీరామ్, సంచితా పడుకొనే జంటగా ఎన్వీఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అసలేం జరిగింది'. ఎక్సోడస్ మీడియా పతాకంపై కె.నీలిమా నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'లవ్, సస్పెన్స్ జోనర్లో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు అందమైన లొకేషన్లలో ఇటీవల ప్రారంభమైంది. రెండు పాటలు, క్లైమాక్స్ సీన్స్, పోరాటాలు, సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. ఈ నెల 31లోపు టాకీ పార్ట్ పూర్తవుతుంది. గ్రాఫిక్స్, ఎడిటింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుతున్నాం' అని అన్నారు. 'కెరీర్ పరంగా నాకు మంచి టర్నింగ్ పాయింట్ అయ్యే చిత్రం అవుతుంది' అని హీరో శ్రీరామ్ చెప్పారు. 'ఈ సినిమాలో పాటలు, ఫైట్లు, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులని కట్టిపడేస్తాయి. ప్రధానంగా యూత్‌ని ఆకర్షించే విధంగా పాటలుంటాయి. ఫైట్ మాస్టర్ శంకర్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. వీటిని ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరిస్తున్నాం' అని కోప్రొడ్యూసర్ కింగ్ జాన్సన్ కొయ్యడ తెలిపారు.