Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్లో రెండేండ్లుగా పెళ్ళి సందడి కొనసాగుతుంది. అనుష్క శర్మ, సోనమ్ కపూర్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా పెళ్ళిళ్లు చేసుకున్నారు. ఇటీవలే దక్షిణాదిలో విశాల్, ఆర్య ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో కథానాయిక శ్రద్ధా కపూర్ సైతం పెళ్ళి పీఠలెక్కేందుకు రెడీ అవుతున్నారట. ఆమె ప్రేమ వివాహానికి సంబంధించి అన్ని రకాల గ్రీన్ సిగల్స్ లభించాయట. ఇంతకి శ్రద్ధ పెళ్ళి చేసుకోబోయేది ఎవరనే డౌట్ రావచ్చు. రోహన్ శ్రేష్ట అనే ఫొటోగ్రాఫర్తో గత కొంత కాలంలో శ్రద్ధ ప్రేమలో ఉన్నారట. ఇరు కుటుంబాల పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పగా, అందుకు వారు గ్రీన్ సిగల్ ఇచ్చారని, వచ్చే ఏడాది మ్యారేజ్ చేసుకోవాలని శ్రద్ధా, రోహన్ ప్లాన్ చేసుకుంటున్నారట. శ్రద్ధ అలనాటి నటుడు శక్తి కపూర్ తనయ అన్న విషయం విదితమే. 2010లో 'టీన్ పట్టీ' చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా బాలీవుడ్లో అగ్ర స్థానానికి ఎదిగి అత్యంత క్రేజీ కథానాయికగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ట్రైలింగ్వల్ 'సాహో'తోపాటు 'చిచ్చోర్','స్ట్రీట్ డాన్సర్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. డెంగీ జ్వరం వల్ల ఇటీవల సైనా నెహ్వాల్
బయోపిక్ నుంచి తప్పుకున్న విషయం విదితమే.