Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమల్ హాసన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'భారతీయుడు 2'. శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'భారతీయుడు'కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. కాజల్ కథా నాయికగా నటిస్తుంది. ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. జనవరిలో సినిమా ప్రారంభమైంది. అయితే కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయిందట. దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్ నిర్మాతలకి మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాల వల్ల షూటింగ్ ఆగిపోయిందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ మేకప్ వల్ల ఆగిందని తెలుస్తుంది. సినిమాలో కమల్ హాసన్ ఎక్కువ శాతం వృద్ధుడి పాత్రలో కనిపించాల్సి ఉంది. ఆ పాత్ర కోసం భారీగా మేకప్ వేసుకోవాలి. ఎక్కువ సేపు మేకప్‌లోనే ఉండాలి. అయితే ఈ మేకప్ వేసుకోవడం వల్ల కమల్ హాసన్‌కి అలర్జీ వస్తుందట. మొదట్లో ఇలా అలర్జీ రావడంతో కొన్ని రోజులు షూటింగ్ ఆపారు. ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నించగా అలాగే అలర్జీ వస్తుండటంతో కొంత కాలం చిత్రీకరణకి విరామం ఇవ్వాలని నిర్ణయించారట. అన్ని సెట్ అయ్యాక తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇటీవల సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్ విడుదల చేశారు. ఇందులో వృద్ధుడిగా కమల్ లుక్ ఆదంతం ఆకట్టుకుంటోంది. సినిమాపై భారీ అంచనాలని పెంచుతోంది.