Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రధారులుగా 'యురేక' చిత్రం రూపొందుతుంది. కార్తీక్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత నిర్మిస్తున్నారు. లలిత కుమారి సహనిర్మాత. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ని గురువారం హోలీ పండుగ సందర్భంగా విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇంజ నీరింగ్ కాలేజ్ నేపథ్యంలో లవ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు జరుపుకుంటోంది. చిత్రంలోని ప్రధాన పాత్రలతో రూపొందిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఎంతో ఇంటెన్స్‌గా ఉంటూ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నాం' అని అన్నారు. సమీక్ష, బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభరు, రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, మస్త్ అలీ, ఆర్.కె.వేణుగోపాల్‌రావు, కోటేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నరేష్ కుమారన్, కెమెరా: ఎస్.బి.విశ్వకాంత్, ఎడిటింగ్: గ్యారీ.బి.హెచ్, అనిల్ కుమార్.పి, ఆర్ట్: అవినాష్.