Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ హీరోగా, జేడీ చక్రవర్తి కీలక పాత్రలో టిఎస్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'హిప్పీ'. వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ని హీరో నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, 'కార్తికేయతో కలిసి 'గ్యాంగ్‌లీడర్'లో నటిస్తున్నాను. 'ఆర్ ఎక్స్ 100' గురించి ఇంతకు ముందు చాలా విన్నా. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే. కార్తికేయ చాలా బాగా చేశారని అంతా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అతనితో కలిసి పనిచేస్తుంటే, ఆ సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయ్యి ఉంటుందో అర్థమైంది. కార్తికేయతో పనిచేయడం చాలా సరదాగా ఉంది. ఈ చిత్ర టీజర్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. విజయవంతమైన సినిమాకి ఉండాల్సిన లక్షణాలు, వైబ్రేషన్స్ ఇందులో ఉన్నాయి. ఈ సమ్మర్లో తప్పకుండా కూల్ సినిమా అవుతుంది. పెద్ద విజయం సాధిస్తుంది. చిత్ర బృందానికి అభినందనలు' అని అన్నారు. 'నానితో కలిసి 'గ్యాంగ్ లీడర్'లో నటించే అవకాశం వచ్చింది. ఆ చనువుతో ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేయాలని అడగ్గా వెంటనే ఒప్పుకున్నారు. 'నువ్వు అడక్కపోయినా విడుదల చేసేవాడిని' అని అన్నారు. అంత మంచి వ్యక్తి ఆయన. ఇండిస్టీకి వచ్చాక నాకు ఇంకా ఏ పెద్ద హీరో తెలియదని అనుకుంటున్న తరుణంలో నానితో సినిమా చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఆయనతో ఈ జర్నీ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా' అని హీరో కార్తికేయ చెప్పారు. దర్శకుడు విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ, 'ఈ చిత్ర దర్శకుడు నాకు మంచి స్నేహితుడు. టీజర్ చూస్తుంటే మంచి ఫన్ రైడ్‌లా అనిపిస్తోంది. సినిమా పెద్ద హిట్ కావాలి' అని చెప్పారు. 'మా చిత్ర టీజర్‌ని రిలీజ్ చేసిన నానికి, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న దర్శకులు విక్రమ్ కుమార్‌కి ధన్యవాదాలు' అని చిత్ర దర్శకుడు టీఎస్ కృష్ణ అన్నారు. చిత్ర నిర్మాత చెబుతూ, 'రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఒక పాటని రామోజీ ఫిల్మ్ సిటీలో, మరో పాటని పబ్‌లో చిత్రీకరిస్తాం. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ షూటింగ్ జరుగుతుంది. టీజర్‌కి మంచి స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది. అందరి అంచనాలను అందుకునేలా సినిమాని తెరకెక్కిస్తున్నాం. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం' అని చెప్పారు. దిగంగన, జజ్బా సింగ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్ డీ రాజశేఖర్, సంగీతం: నివాస్ కె ప్రసన్న, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్.